Russia Marks Another Record Number of COVID-19 Cases | రష్యాలో కొనసాగుతోన్న కరోనా మరణమృదంగం

Russia Marks Another Record Number of COVID-19 Cases | రష్యాలో  కొనసాగుతోన్న కరోనా మరణమృదంగం

రష్యాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ తో 1123 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి ప్రభావం మొదలయ్యాక ఒక్కరోజులో నమోదైన రికార్డు స్థాయి మరణాలు ఇవే. కొత్తగా మరో 36 వేల 582 మంది కరోనా బారినపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఆ దేశంలో నాన్ వర్కింగ్ పిరియడ్ గా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపారాలు ఆ సమయంలో కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. చాలా వరకు దుకాణాలు, పాఠశాలలు, వ్యాయామశాలలు, వినోద వేదికలను మూసి ఉంచనున్నారు. రెస్టారెంట్లు, కేఫ్ ల నుంచి ఆహార పదార్థాలను తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఔషధ దుకాణాలు, కిరాణా దుకాణాలు తెరిచే ఉండనున్నాయి. టీకా వేసుకోని 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. రష్యా జనాభా 14 కోట్ల 60 లక్షలుకాగా వీరిలో దాదాపు 5 కోట్ల మందే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments