Uttej Wife Passed Away Exclusive Visuals | TFI Celebrities Pay Condolense to Uttej Wife |Cinemadosth

Uttej Wife Passed Away Exclusive Visuals | TFI Celebrities Pay Condolense to Uttej Wife |Cinemadosth

#UttejWife Passed Away Exclusive Visuals | TFI Celebrities Pay Condolense to Uttej Wife #Cinemadosth #UttejWifePassedAway

ప్రముఖ సినీనటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మావతి క్యాన్సర్ తో పోరాడుతూ హైదరాబాద్
బసవతారకం ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో చికిత్సపొందుతున్న ఆమె ఇవాళ ఉదయం
ఎనిమిదన్నర గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వాములయ్యేవారు. ఉత్తేజ్ కు
చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ సహా
ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి బసవతారకం ఆస్పత్రికి చేరుకొని
ఉత్తేజ్ కుమార్తెలను ఓదార్చారు. చిరంజీవి రాకతో ఉత్తేజ్ తన భార్యను తలుచుకుంటూ గుండెలవిసేలా రోధించారు. జీవిత
రాజశేఖర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజి, ఏడిద శ్రీరామ్ సహా పలువురు నటీనటులు ఉత్తేజ్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆస్పత్రి
నుంచి పద్మావతి భౌతికకాయాన్ని బోరబండలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి తరలించారు. అక్కడికి ప్రముఖ గేయ రచయిత,
ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజతోపాటు పలువురు సినీప్రముఖులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరై
నివాళులర్పించారు. ఉత్తేజ్ ఆయన భార్య పద్మావతితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఉత్తేజ్ తన సతీమణి పద్మావతికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మయూఖా టాకీస్ ఫిల్మ్ యూక్టింగ్ స్కూల్ విద్యార్థులు హాజరై పద్మావతికి తుది వీడ్కోలు పలికారు.

CinemadosthCinemadosth InterviewsUttej Wife Passed Away Exclusive Visuals

Post a Comment

0 Comments